మెగా157 కోసం మెగా డెసిషన్.. వయసుకు తగ్గ పాత్రలో చిరంజీవి

మెగా157 కోసం మెగా డెసిషన్.. వయసుకు తగ్గ పాత్రలో చిరంజీవి

మెగాస్టార్ చిరజీవి(Megastar chiranjeevi) మెగా డెసిషన్ తీసుకున్నారు. తన తరువాతి సినిమా మెగా157(Mega157) కోసమే ఈ సాలిడ్ డెసిషన్ తీసుకున్నారని సమాచారం. ఇక ముందులా కాకుండా సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారట చిరు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి తన తరువాతి సినిమాను దర్శకుడు వశిష్టతో చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టు గురించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియా అండ్ ఫిలిం సర్కిల్ లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలో చాలా మెచ్యూర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట. కమల్ హాసన్ కు  విక్రమ్, రజినీకాంత్ కు జైలర్ లా.. చిరంజీవి కూడా ఆయన ఏజ్ కి తగ్గ పాత్రలో కనిపిస్తారని, ఇందులో రొమాన్స్ ఉండదని తెలుస్తోంది. మరి ఈ సారైనా బాస్ కి తగ్గ సినిమా పడుతుందా చూడాలి మరి.

ఇక మెగా157 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చోటా కె నాయుడు కెమెరామెన్ గా చేస్తున్నారు. ఇక అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ గానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.