V6 News

చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి.. నిధులు కాజేసింది వీళ్లేనంటూ రిపోర్టులో సినీ ప్రముఖుల పేర్లు !

చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి.. నిధులు కాజేసింది వీళ్లేనంటూ రిపోర్టులో సినీ ప్రముఖుల పేర్లు !

హైదరాబాద్: చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. 2005 నుంచి 2020 వరకూ జరిగిన అవకతవకలపై విచారణ ముగిసింది. నవంబర్‌ 27న ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ ఎంక్వైరీ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో విచారణ కమిటీ తెలిపింది. గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్.. తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

చిత్రపురి కాలనీ కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లు వినిపించాయి. నివేదికలో బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్‌తో పాటు పలువురి పేర్లు కూడా ఉన్నాయి. రూ.43.78 కోట్లు రికవరీ చేయాలని రిపోర్ట్ ఇచ్చిన విచారణ కమిటీ.. అదనంగా 18 శాతం చెల్లించాలని చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులను ఆదేశించింది. డిప్యూటీ రిజిస్ట్రార్ 15 మందికి నివేదిక కాపీని పంపారు. 

Also read:-  అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు నడిపే దిశగా ప్లాన్

చిత్రపురి కాలనీలో నిర్మించిన ప్లాట్లను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అల్ప వర్గాల

బస్సులు నడిపే దిశగా ప్లాన్కు కేటాయించే ఉద్దేశంతో ఈ కాలనీని ఏర్పాటు చేశారు. కానీ.. అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా.. వాటిని బ‌య‌టి వారికి కట్టబెట్టి అడ్డగోలుగా దోచుకున్నారనేది ప్రధాన అభియోగం. చిత్ర పురి కాలనీలోని ప్లాట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, కమిటీ సభ్యులకు కాకుండా బ‌య‌టి వారికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని గతంలోనూ వార్తలొచ్చాయి. రేవంత్ సర్కార్ చెరువులు, నాలాలు కబ్జా చేసిన వారిపై హైడ్రా పేరుతో కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్రమాల వ్యవహారం మరోసారి బయటకొచ్చింది.