పోలీసుల తనిఖీల్లో రూ.4 కోట్ల హవాలా డబ్బు

V6 Velugu Posted on Oct 20, 2021

నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున హవాలా డబ్బు పట్టుపడింది. హైదరాబాద్ - విజయవాడ హైవేపై చిట్యాల పోలీసుల తనిఖీల్లో డబ్బును గుర్తించారు. హైవేపై తనిఖీలు చేస్తుండగా కారు డ్రైవర్, రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అలర్టైన పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా 4 కోట్ల రూపాయల బయటపడ్డాయి. కారులో వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  హైదరాబాద్ నుంచి చెన్నై కి డబ్బు తీసుకెళ్తుండగా చిట్యాల పోలీసులు పట్టుకున్నారు.
 

Tagged car, hawala money, transporting, Chityala Police, 4 Crores

Latest Videos

Subscribe Now

More News