లెక్కలతో "కోబ్రా" నేరాలను ఈజీగా చేస్తున్నాడు

లెక్కలతో "కోబ్రా" నేరాలను ఈజీగా చేస్తున్నాడు

పాత్రకు ప్రాణం పోసే నటుడు చియాన్ విక్రమ్. ప్రయోగానికి కెరాఫ్ అడ్రస్ విక్రమ్. ఏ సినిమా చేసినా..అందులో పాత్రలతో ప్రయోగం చేస్తూ..ఫ్యాన్స్ ను అలరిస్తాడు. తాజాగా చియాన్ విక్రమ్ కోబ్రా మూవీతో వస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ మూవీలో  విక్రమ్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

ఈ సినిమా గణితశాస్త్రం చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. ‘కోబ్రా.. లెక్కలతో నేరాలను చాలా తేలికగా చేస్తున్నాడు’ అనే డైలాగ్‌ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. మరి, లెక్కలతో కోబ్రా ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, కె.ఎస్‌. రవికుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ముఖ్య పాత్రలో సందడి చేయనున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియో సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు.

కోబ్రా ఈజ్ ఏ జీనియస్ మాథమెటిషీయన్..అతను మాథ్స్ ఉపయోగించి అసాధ్యమైన క్రైమ్స్ను చాలా  తేలికగా చేస్తున్నాడనే డైలాగ్ తో టీజర్ ఆరంభమవుతుంది. నెంబర్స్ తో ఆడుకుంటున్నాడు కదా....ఐ విల్ గివ్ మోర్ నెంబర్స్ దిస్ టైం అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మొత్తంగా టీజర్ ను చూస్తుంటే హీరో..విలన్ మధ్య ఇంట్రస్టింగ్ నెంబర్ వార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. 

కోబ్రా సినిమాను అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం తెరకెక్కించగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.  మృణాళిని రవి, కె.ఎస్‌. రవికుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 7 స్క్రీన్‌ స్టూడియో సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. ఆగష్టు 31న సినిమా విడుదల కానుంది.