Vikram, Vishnu: ‘విక్రమ్, విష్ణు ఎడవన్’ కాంబోపై ఉత్కంఠ.. లిరిసిస్ట్, స్టోరీ రైటైర్గా కోలీవుడ్లో సంచలనం

Vikram, Vishnu: ‘విక్రమ్, విష్ణు ఎడవన్’ కాంబోపై ఉత్కంఠ.. లిరిసిస్ట్, స్టోరీ రైటైర్గా  కోలీవుడ్లో సంచలనం

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటన శైలి వేరే. తన ప్రయోగాలతో విలక్షణతకే వన్నె తెచ్చే హీరో ఇతను. ప్రస్తుతం విక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే తంగలాన్, వీర ధీర శూరణ్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాలను అధికారికంగా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ని అలర్ట్ చేసాడు.

అందులో ఒకటి మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. మండేలా, మావీరన్ (తెలుగులో మహావీరుడు) సినిమాలతో మడోన్ అశ్విన్ బాగా గుర్తింపు పొందారు. ఇది విక్రమ్ కెరియర్లో 63వ సినిమాగా రానుంది.

ఆ తర్వాత ‘96’, ‘సత్యం సుందరం’ సినిమాలతో ఫీల్ గుడ్ డైరెక్టర్గా పేరుపొందిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో.. విక్రమ్ 64వ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే, ఈ రెండు ప్రాజెక్ట్స్ అధికారికంగా ప్రకటించబడ్డాయి. కానీ, మిగతా షూటింగ్స్ వివరాల నుంచి ఇంకెలాంటి సమాచారం లేదు.

అయితే, ఈ క్రమంలోనే చియాన్ విక్రమ్.. నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతుందని వినికిడి. యంగ్ టాలెంటెడ్ లిరిసిస్ట్, స్టోరీ రైటర్ విష్ణు ఎడవన్ డైరెక్షన్లో విక్రమ్ సినిమా రానుందని కోలీవుడ్ వర్గాల టాక్.

►ALSO READ | సినీ ఇండస్ట్రీలో విషాదం.. తొలి తెలుగు గాయని బాలసరస్వతీ కన్నుమూత

ఇప్పటికే, విష్ణు ఎడవన్.. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యాన‌‌ర్‌‌ అధినేత నిర్మాత ఇసరి గణేష్‌కు కథను అందించి, నేరేషన్ ఇచ్చాడట. ఆ కథ అతన్ని ఎంతగానో ఆకట్టుకోవడంతో.. విక్రమ్‌కు సిఫార్సు చేశాడని సమాచారం. విక్రమ్‌కు కూడా కథ నచ్చి విష్ణు దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని లేటెస్ట్ టాక్.

ఇపుడు ఈ క్రేజీ టాక్ కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ, విక్రమ్-విష్ణు ఎడవన్ కాంబో అనౌన్స్ వస్తే మాత్రం.. అది చియాన్ ఫ్యాన్స్కి పెద్ద బోనస్ అన్నట్లే!!

విక్రమ్-విష్ణు ఎడవన్ కాంబోపై ఉత్కంఠ:

రైటర్ విష్ణు ఎడవన్: ఇతని టాలెంట్ ఇప్పటికే చాలాసార్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రూవ్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ టీమ్లో చాలా కాలం నుంచి అసిస్టెంట్‌ రైటర్ గా పనిచేస్తున్నాడు. 'విక్రమ్' మరియు 'లియో' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కో రైటర్గా పనిచేస్తూనే.. అద్భుతమైన సాంగ్స్ రాశారు.

'విక్రమ్' లోని తమిళ సాంగ్ 'పోరాట సింహం 'మరియు 'నాన్ రెడీ థాన్' వంటి సూపర్ హిట్ పాటలు అందించారు. ఈ సాంగ్స్తో తనలోని ప్రతిభను చూపించి శభాష్ అనిపించుకున్నారు. కోలీవుడ్లో ఇంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విష్ణు.. చియాన్ విక్రమ్ లాంటి వర్సటైల్ యాక్టర్తో జతకట్టబోతున్నాడనే వార్త అభిమానుల్లో గొప్ప అంచనాలను సృష్టించింది. ఇకపోతే, ఈ మూవీకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పనిచేయనున్నారు.