‘దళితబంధు’పై జీవన్ రెడ్డి వర్సెస్ సుంకే రవిశంకర్

‘దళితబంధు’పై జీవన్ రెడ్డి వర్సెస్ సుంకే రవిశంకర్

దళితబంధు పథకంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఘాటుగా స్పందించారు. దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మతిభ్రమించి, సంస్కరహీనంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పుట్టగతులు ఉండవన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు అవిభక్త కవలలు అని వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఈ కామెంట్స్ చేశారు. 

దళితబంధు పథకంలో ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే వారిని జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చెప్పారు. BRS ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ ఏం మాట్లాడారనే విషయాలు తమకే తెలుస్తాయని, ప్రతిపక్ష నాయకులకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడిన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కనబడడం లేదా అని ప్రశ్నించారు. దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా చూసింది మీరు కదా అని వ్యాఖ్యానించారు. దళితులకు కాంగ్రెస్ హయాంలో ఏం చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశ చరిత్రలో దళితబంథు పథకం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పారు.