కుక్కిన పేనులా కేటీఆర్, హరీశ్..కవిత ఆరోపణలపై ఎందుకు స్పందిస్తలేరు? : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కుక్కిన పేనులా  కేటీఆర్, హరీశ్..కవిత ఆరోపణలపై ఎందుకు స్పందిస్తలేరు? : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  •     చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్  లీడర్లు కేటీఆర్, హరీశ్ పై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేస్తున్నా... వారు మాత్రం జవాబు ఇవ్వకుండా కుక్కిన పేనులా పడి ఉంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాత్రం అదేపనిగా విమర్శలు చేస్తున్నారని ఫైర్  అయ్యారు. సోమవారం సీఎల్పీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్, హరీశ్  జవాబివ్వడం లేదంటే ఆ ఆరోపణలు నిజమనే అనుకోవాల్సి వస్తుందన్నారు. ‘‘మీ ఇద్దరు ఏ తప్పూ చేయకుంటే కవిత చేస్తున్న ఆరోపణలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. 

సీఎంను తిడుతూ రాక్షసానందం పొందుతున్న కేటీఆర్... జనంలో మాత్రం పలచన అవుతున్న విషయాన్ని గుర్తించాలి. సీఎంగా రేవంత్ రెడ్డి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేటీఆర్, హరీశ్  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాను కించపరుస్తూ.. ప్రజాస్వామ్యానికే తలవంపులు తెస్తున్నారు” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.