మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం రెడీగా ఉండాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం  మున్సిపల్​ ఎన్నికలపై సీఎస్​ రామకృష్ణారావు ఆయా జిల్లాల కలెక్టర్లు,  జిల్లా అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్  జిల్లా అధికారులతో మాట్లాడారు. ఫైనల్ ఓటరు లిస్టు, పోలింగ్ కేంద్రాల లిస్టు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం  ప్రకటించాలన్నారు. 

ఎన్నికలను ప్రశాంత వాతరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  నోడల్​ అధికారులు, జోనల్ అధికారులు,  ఫ్లయింగ్,  స్టాటిస్టిక్​, సర్వేయలెన్స్​టీమ్స్,  సెక్టోరియల్ అధికారులు, నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి, అధికారులకు ట్రైనింగ్​,  స్ర్టాంగ్​ రూమ్​ తదితర అంశాలకు సంబంధించి సిద్ధం చేయాలన్నారు.  సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్,  సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో వీణ,  తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.