ఆర్మూర్ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే బ్లాక్ లిస్టులో పెట్టండి : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

ఆర్మూర్ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే బ్లాక్ లిస్టులో పెట్టండి : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

​ఆర్మూర్, వెలుగు : అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేదిలేదని, కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు. ఆర్మూర్ లో సోమవారం అడిషనల్​ కలెక్టర్​ అంకిత్​, మున్సిపల్ కమిషనర్ శ్రావణి తో కలిసి ఎమ్మెల్యే అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. ఒడ్డెర కాలనీలో డ్రైనేజీ నిర్మాణం నాసిరకంగా ఉందని, పక్కన మొరం ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. 

అధికారులు ఉదయం, సాయంత్రం వేళల్లో పనుల పురోగతిని పరిశీలించాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల పనులన్నీ ప్రారంభించాలని సూచించారు. మామిడిపల్లిలో గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేసి శిలాఫలకాలు వేసిన పనులు ప్రారంభించి ఎందుకు ఆపేశారన్నారు. టౌన్​ పరిధిలోని రూ. 65 కోట్లతో పనులు జరుగుతున్నందున అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అధికారులు, బీజేపీ నాయకులు ఉన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

ఆర్మూర్​లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. డిప్యూటీ తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో శివాజీ, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు. 

వివేకానందకు నివాళి..

ఆర్మూర్​ టౌన్​లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి స్వామి వివేకానంద ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  దేశాభివృద్ధికి దశ, దిశ కల్పించిన ఘనత స్వామి వివేకానందకే దక్కిందన్నారు.  కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్​ కంచెట్టి గంగాధర్,  బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, బీజేపీ, బీజైవైఎం టౌన్ ప్రెసిడెంట్స్ మందుల బాలు, ఉదయ్ గౌడ్, సర్వసమాజ్​ అధ్యక్షుడు కొట్టాల సుమన్​, కలిగోట గంగాధర్, పోల్కం వేణు, పెద్దోళ్ల భరత్, కోమన్​పల్లి శ్రీను, దోండి ప్రకాశ్​తదితరులు పాల్గొన్నారు.