కామారెడ్డిటౌన్, వెలుగు : జిల్లాలో నేరాల నియంత్రణకు సమన్వయంతో పని చేయటంతో పాటు, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ఆఫీస్‌లో నెలవారీ క్రైమ్ రివ్యూ నిర్వహించి మాట్లాడారు. ప్రతి కేసులో క్వాలిటీ ఎంక్వైరీ ఉండాలని, బాధితులకు అండగా నిలబడాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజా అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోడి పందాలు, పేకాట వంటి ఆటలను నిరోధించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు మంగళవారం నుంచి రాష్ర్టవ్యాప్తంగా ప్రారంభం కానున్న ఆరైవ్ అలైవ్ ప్రోగ్రాంను జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామన్నారు. అధికారులు గ్రామాలను విజిట్ చేయాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వహించకూడదన్నారు. 2025 ఏడాదిలో జరిగిన ఆస్తి సంబంధించి నేరాల్లో 45 శాతం ఛేదించగా, 4 శాతం ఆస్తి రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
