పటాన్ చెరులో 92 కిలోల ఎండు గంజాయి పట్టివేత

పటాన్ చెరులో 92 కిలోల ఎండు గంజాయి పట్టివేత
  • ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్ 
  • రూ.2.40 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
  •  ఏసీపీ శ్రీనివాస్ ​కుమార్అమీన్​పూర్ (పటా

పటాన్ చెరు, వెలుగు:  మహారాష్ట్రకు ఎండు గంజాయిని తరలిస్తున్న అంతరాష్ర్ట ముఠాను   సైబరాబాద్​ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ.2.46 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసున్నారు. పటాన్​చెరు పోలీస్​ స్టేషన్​లో రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్​కుమార్ సోమవారం  మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు ఎండు గంజాయిని  రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో పటాన్​చెరు పోలీసులు, ఎస్​ఓటీ టీమ్ తనిఖీలు చేపట్టారు. 

ఆదివారం సాయంత్రం పటాన్​చెరు సమీపంలోని ముత్తంగి ఓఆర్​ఆర్​ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. మహారాష్ర్ట రిజిస్ర్టేషన్​నంబర్లు ఉన్న డీసీఎం నుంచి 19 ప్యాకెట్లలోని 92 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు సచిన్​ గంగారాం చవాన్​, మహేశ్​ రవీంద్ర వట్కర్​, విజయ్​ చవాన్​ ను అదుపులోకి తీసుకున్నారు.

 విచారణలో గంజాయిని ఒడిశాలోని పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన జాఫర్​వద్ద నుంచి తీసుకుని మహారాష్ర్టలోని సోలాపూర్​కు చెందిన అజిత్​జంతాప్​కు అందించేందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు.  రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పటాన్​చెరు పోలీసులు, ఎస్​ఓటీ టీమ్ ను ఏసీసీ శ్రీనివాస్​కుమార్​అభినందించారు. సీఐ వినాయక్​రెడ్డి, ఎస్​ఐలు అసిఫ్​అలీ, మహేశ్వర్​రెడ్డి, పోలీస్​ సిబ్బంది ఉన్నారు.