ఆర్మూర్లో తాళం వేసిన ఆరు ఇండ్లల్లో చోరీ

ఆర్మూర్లో తాళం వేసిన ఆరు ఇండ్లల్లో చోరీ

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత తాళం వేసిన ఆరు ఇండ్లల్లో చోరీ జరిగింది. ఎస్​హెచ్​వో సత్యనారాయణగౌడ్ వివరాల ప్రకారం.. హుస్నాబాద్ గల్లీలో పాల గంగాధర్ తనకు చెందిన ఓ పోర్షన్​కు తాళాలు వేసి మరో పోర్షన్​ లో పడుకున్నారు. దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువాలోని 9  తులాల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి చోరీ చేశారు.

 ఔట్ గల్లీలో ఒక కిరాణా షాపులో నుంచి కిరాణ సామగ్రి ఎత్తుకెళ్లారు. మరో నాలుగు ఇండ్ల తాళాలు పగులగొట్టినప్పటికీ అక్కడ విలువైన వస్తువులు దొరక్కపోవడంతో వెళ్లిపోయారు. క్లూస్​ టీం వేలిముద్రలు సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​హెచ్​వోతెలిపారు.