టికెట్ ఇస్తే దేవుడు.. లేదంటే దయ్యామా..?

టికెట్ ఇస్తే దేవుడు.. లేదంటే దయ్యామా..?
  • బీజేపీ మహిళా నేత బొడిగె శోభపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ ఫైర్

కరీంనగర్: నీకు టికెట్ ఇస్తే దేవుడు.. లేదంటే దయ్యమా.. ? అంటూ బీజేపీ మహిళా నేత బొడిగె శోభపై చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ నిప్పులు చెరిగారు. నిన్న మంథని బీజేపీ సభలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ చేసిన విమర్శలపై కౌంటర్ గా మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. బొడిగె శోభను అసభ్య పదజాలంతో దూషించిన ఆయన నీకు బుద్ధి, సిగ్గు, మానం ఉందా.. నీవు ఆడదానివా?” అంటూ నోరు పారేసుకున్నారు. ‘‘ఆనాడు కేసీఆర్ తండ్రి, దేవుడని చెప్పిన శోభ.. ఇప్పుడు విమర్శలు చేస్తోంది..ఖబర్దార్ శోభ.. అన్నం పెట్టిన కుటుంబం మీద కుక్కలా మొరుగుతున్నావ్..నీ భాగోతం మాకందరికీ తెలుసు.. నీకంటే లక్ష రెట్లు తిట్లు మాకొస్తాయి..నీకు కరీంనగర్, హైదరాబాద్ లో ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో అన్నీ తెలుసు.. అవన్నీ బయటపెడ్తాం.. ’’ అని ఎమ్మెల్యే రవిశంకర్ హెచ్చరించారు.  ’’కేసీఆర్ కూడా ఆనాడు శోభ తనకు కన్నబిడ్డలాంటిదని ప్రజల ముందు చెప్పాడు..  ఏమీ లేని శోభను జెడ్పీటీసీని, ఎమ్మెల్యేను చేస్తే.. ఇప్పుడు టికెట్ ఇవ్వలేదని నోరు పారేసుకుంటోంది..ఈ విషయాన్ని బండి సంజయ్ గుర్తుంచుకోవాలి.. రేపు మీరు టికెట్ ఇవ్వకపోయినా మీ గతి కూడా ఇంతే.. ’’ అన్నారు. ప్రభుత్వ విధి విధానాల్లో తప్పులుంటే విమర్శించు.. సూచన చేయి కానీ.. కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదు.. ఆనాడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కాగితం చూసుకుంటూ కూడా చదవడం రాని ముర్ఖురాలు, చదువురాని దద్దమ్మ అంటూ ఎమ్మెల్యే రవిశంకర్ వీడియో ప్రదర్శించారు. గతంలోనూ ఈమె విమర్శలు చేసినా ఊర్లో మేము మాట్లాడలేదు.. కానీ రోజు రోజుకు పేట్రేగిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటంతో ఇవాళ ఇలా మాట్లాడాల్సి వస్తోంది.. నేను కూడా 2014లో టికెట్ ఆశిస్తే నాకు పార్టీ ఇవ్వలేదు.. అలాగని నీలా బయటకు పోయి విమర్శలు చేయలేదు.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లంచాలు తీసుకుంది.. 2001కి ముందు ఇల్లు లేని వ్యక్తి.. ఇప్పుడు నీకు కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చాయి?  నీ పద్ధతి మార్చుకోకపోతే తన్ని తరిమేసే రోజులు వస్తాయి.. ఇన్ని రోజులు ఉద్యమంలో కలిసి పనిచేసామన్న కృతజ్ఞతతో వదిలేసాం..’’ అని ఎమ్మెల్యే రవిశంకర్ హెచ్చరించారు.