
హైదరాబాద్, వెలుగు: యూరియాను కాం గ్రెస్ నేతలే బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారన్న కేటీఆర్ కామెంట్లకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కౌంటర్ ఇచ్చారు. యూరియా ను బీఆర్ఎస్ నేతలే బ్లాక్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
యూరియాను బ్లాక్ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకుల సమాచారం తమ దగ్గర ఉందని, వాటిని త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడుతామన్నారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. యూరియాను బ్లాక్ చేసేవారిపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. యూరి యా కొరతపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండని, దీనిపై కేంద్రాన్ని నిలదీయడానికి ఆయన భయపడుతున్నారని విమర్శించారు.