కొరియోగ్రఫీ , యాక్టింగ్ రెండు వేరు కాదు..

కొరియోగ్రఫీ , యాక్టింగ్ రెండు వేరు కాదు..

ఎస్.ఆర్ కళ్యాణ మండపంతో సూపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన మూవీ నేను మీకు కావాల్సిన వాడిని. అతనికి జోడిగా సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌ నటించారు. వీరితో పాటు..ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వం వహించడంతో ..సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  కోడి రామ‌కృష్ణ  కుమార్తె  కోడి దివ్య దీప్తి చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ  సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ సందర్బంగా  నేను మీకు కావాల్సిన వాడిని మూవీలో కీలక పాత్ర పోషించిన స్టార్ కోరియోగ్రాఫర్ బాబా భాస్కర్ వీ6తో ముచ్చటించారు.

నాకు సినిమానే జీవితం..
నేను మీకు కావాల్సిన వాడిని సినిమాలో నటించడం సంతోషంగా ఉందని కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ తెలిపాడు. ఎంతో మందికి  లైఫ్ ఇచ్చిన కోడిరామకృష్ణ  బ్యానర్ లో నటించడం ఆనందంగా ఉందన్నాడు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం స్నేహితుడిగా నటించానని వెల్లడించాడు. కిరణ్ తో పనిచేయడం ఈజీగా ఉందని..అతను అందరితో బాగా కలిసిపోతాడని చెప్పాడు.  స్టోరీ విషయంలో డైరెక్టర్ శ్రీధర్ గాదెకు క్లారిటీ ఉందని..అతను మూవీకి కోసం శ్రమపడ్డాడని తెలిపాడు. తాను కొరియోగ్రాఫర్, డ్యాన్సర్, యాక్టర్ ..ఏది చేసినా..తనకు సినిమాయే జీవితమని బాబా భాస్కర్ వివరించాడు. 

కొరియోగ్రఫీ , యాక్టింగ్ రెండు వేరు వేరు కాదు..
నాకు ఏ సినిమాలో ఎలాంటి అవకాశం ఇచ్చినా చేస్తానని బాబా భాస్కర్ చెప్పాడు. చిన్న కారెక్టరా..పెద్ద కారెక్టరా అని చూడనన్నాడు. తాను కూడా ఒక సినిమా డైరెక్షన్ చేశానని వెల్లడించాడు. ఆ తర్వాత  డైరెక్షన్ చేయాలని చాలా స్టోరీలు సిద్దం చేసుకున్నానని.. టైమ్ సెట్ అయితే వెంటనే సినిమా చేస్తాననన్నాడు.  కొరియోగ్రాఫర్ గా నేషనల్ స్థాయిలో అవార్డులు అందుకోవాలనేది తన కోరిక అని చెప్పాడు. 

ఒక సాంగ్కు కొరియోగ్రఫీ చేశా..
నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీలో ఒక సాంగ్ ను కంపోజ్ చేసినట్లు బాబా భాస్కర్ వెల్లడించాడు. లాయర్ పాప సాంగ్ కు కొరియోగ్రఫీ చేశానని చెప్పాడు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నాడు. మొత్తంగా నేనుమీకు కావాల్సిన వాడిని మూవీ..మంచి కంటెంట్ తో వస్తున్న ఫ్యామిలీ మూవీ అని బాబా భాస్కర్ వెల్లడించాడు.  అందరూ వచ్చి చూసేలా ఉంటుందని హామీ ఇస్తున్నాడు. ప్రస్తుతం తాను తెలుగులో నీలకంఠం తీసే సినిమాలో నటిస్తున్నానని తెలిపాడు. అలాగే తమిళ్ లో ఒక చిత్రానికి కొరియోగ్రఫీ  చేస్తున్నానన్నాడు.