కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూత

కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూత

ప్రముఖ  కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. తెలుగు,తమిళ,హిందీ సహాపలు భాషల్లో 800లకు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. 1948లో చెన్నైలో డిసెంబర్ 7న జన్మించారు.  తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి తల్లి  కోమల అమ్మాళ్. 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేశారు. శివశంకర్ మాస్టర్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు.

శివశంకర్ మాస్టర్ తో పాటు ఆయన పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శివశంకర్ మాస్టర్ భార్య కూడా హోం క్వారంటైన్ లో ఉన్నారు. శివశంకర్ మాస్టర్ కు వైద్యం అందించడానికి రోజుకు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయని డాక్టర్లు చెప్పారు. ఈ విషయంపై స్పందించిన   సోనూసూద్‌, ధనుష్‌ వైద్యానికి తమవంతు సాయం  చేశారు. మెగాస్టార్ చిరంజీవి తక్షణ సాయంగా రూ.3లక్షలు ఇచ్చారు. శివశంకర్ మృతితో  సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. శివశంకర్‌ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  కోరారు. మగధీరలో ధీర ధీర సాంగ్ కు కొరియో గ్రఫీ చేసిన శివశంకర్ మాస్టర్ కు ఉత్తమ నేషనల్ కొరియోగ్రాఫర్ అవార్డ్ వచ్చింది.