
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల మోరిస్ క్రికెట్లో 12 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. దేశవాళీ టీ20 జట్టు ‘టైటాన్స్’కు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని మోరిస్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు.
మోరిస్ చివరిసారిగా 2019 వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఆడాడు. ఈ టోర్నమెంట్‌లో మోరిస్ దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మోరిస్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 69 మ్యాచ్‌లు ఆడి.. 94 వికెట్లు పడగొట్టాడు. మోరిస్ 2012 డిసెంబర్లో టీ20 ద్వారా క్రికెట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఏడాది 2013 జూన్‌లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం 2016లో టెస్టుల్లోకి ప్రవేశించాడు.
వన్డేల్లో 42 మ్యాచులు ఆడిన మోరిస్.. 48 వికెట్లు తీశాడు. అదేవిధంగా 234 టీ20 మ్యాచులు ఆడిన క్రిస్.. 290 వికెట్లు పడగొట్టాడు. మోరిస్ ఆఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా బే జెయింట్స్, నార్త్ వెస్ట్, లయన్స్ మరియు టైటాన్స్ జట్లలో ఆడాడు. అంతేకాకుండా.. ఇంగ్లాండ్ కు చెందిన సర్రే, హాంప్‌షైర్ తరపున, వెస్టిండీస్‌కు చెందిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, మరియు ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ థండర్ తరపున కూడా ఆడాడు.
చెన్నై తరపున ఒకే ఒక టీ20 ఆడిన మోరిస్.. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కూడా ఆడాడు. మోరిస్‌ను చెన్నై రూ. 4 కోట్లకు తీసుకుంటే.. ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ. 7 కోట్లకు తీసుకుంది. ఆ తర్వాత 2020 ఐపీఎల్ లో బెంగుళూర్ రూ. 10 కోట్లు కేటాయించింది. చివరగా 2021 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ మోరిస్‌ను అత్యధికంగా రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది.
For More News..