
- నిధులు, పథకాలు, పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- వైఎంసీఏలో చిన్నప్పుడు క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడేవాణ్ని
- అందరూ ఐక్యంగా వైఎంసీఏ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు
- సికింద్రాబాద్ వైఎంసీఏలో అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
పద్మారావునగర్, వెలుగు: క్రిస్టియన్ మైనార్టీలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, వాళ్లు కూడా పార్టీకి అండగా నిలవాలని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో ఇంటర్నేషనల్ఇంటిగ్రేటేడ్సెంటర్ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మల్టీపర్పస్ ప్రోగ్రామ్ సెంటర్కుమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన శంకుస్థాప న చేశారు. అలాగే, కొత్తగా నిర్మించిన ఆడిటోరియం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. క్రిస్టియన్ మైనార్టీలకు నిధులు, సంక్షే మ పథకాలు, పదవుల విషయంలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.
వైఎంసీఏతో నాకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. చిన్నప్పుడు నారాయణగూడ గ్రౌండ్‌లో క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని. విద్యార్థి దశలో క్రికెట్ టోర్నమెంట్ కోసం సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ వైఎంసీఏలో బస చేశాం” అని గుర్తు చేసుకున్నారు. అందరూ ఐకమత్యంతో ఉండి వైఎంసీఏను మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఆడిటోరియం, గెస్ట్‌హౌస్ నిర్మించిన వైఎంసీఏ నిర్వాహకులను మంత్రి అభినందించారు.
క్రిస్టియన్ల సమస్యలు పరిష్కరిస్తున్నం: అడ్లూరి
తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నా రు. ‘‘గత ప్రభుత్వం క్రిస్టియన్లను పట్టించుకోలేదు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రిస్టి యన్ల సమస్యలను పరిష్కరిస్తున్నాను. క్రైస్తవుల శ్మశాన వాటికలు, వాళ్లకు కేటాయించిన భూముల విషయంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించాను. అలాగే, ఈ స్థలాలు కబ్జా కాకుండా ఫెన్సింగ్ వేయాలని చెప్పాను” అని తెలిపారు. వైఎంసీఏ ప్రపంచంలోనే అత్యుత్తమ సేవ లు అందిస్తున్నదని, దీన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అధ్యక్షుడు జయకర్ డేనియల్‌ను అభినందించారు.
గీతారెడ్డికి సత్కారం..
వైఎంసీఏ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నదని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. ‘‘మంత్రి వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీకి ఎంతో గొప్ప పేరుంది. వాళ్ల కుటుంబం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నది” అని అభినందించారు. ఈ సందర్భంగా వైఎంసీఏ ఆశ్రయ్‌కు చైర్మన్‌గా వ్యవహరించి సేవలందించిన గీతారెడ్డిని మంత్రులు సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, వైఎంసీఏ అధ్యక్షుడు జయకర్ డేనియల్, తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర రావు, మంత్రి అడ్లూరి సతీమణి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.