హైదరాబాద్, వెలుగు: కాళోజీ హెల్త్ వర్సిటీ ఇన్‌చార్జీ వైస్ చాన్సలర్‌గా వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల వీసీ పీవీ నందకుమార్ రెడ్డి రాజీనామా చేసినందున రెగ్యులర్ వీసీ నియామకం జరిగే వరకు ఇన్‌చార్జీగా ఆమెను నియమించేందుకు ఫైల్ సీఎంవోకి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
