మెదక్ లాకప్ డెత్ కేసు.. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లసస్పెన్షన్​

మెదక్ లాకప్ డెత్ కేసు.. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లసస్పెన్షన్​
  • మెదక్ లాకప్ డెత్ కేసు.. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లసస్పెన్షన్​
  • ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ

మెదక్, వెలుగు:   మెదక్​లో జరిగిన ఖాదిర్ ఖాన్ లాకప్ డెత్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై వేటు పడింది. మెదక్ టౌన్ సీఐ మధు, ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుళ్లు పవన్, ప్రశాంత్​ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. చైన్ స్నాచింగ్ అనుమానంతో మెదక్​కు చెందిన ఖాదిర్ ఖాన్​ను పోలీసులు పట్టుకెళ్లి ఇంటరాగేషన్ పేరుతో కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన అతను గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే ఖాదిర్ ఖాన్ చనిపోయాడని మృతుడి భార్య సిద్దేశ్వరి, అక్క తబస్సుమ్ ఆరోపించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి కూడా డిమాండ్ వచ్చింది. దీనిపై శనివారం స్పందించిన డీజీపీ అంజనీ కుమార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. మెదక్ టౌన్​ సీఐ మధు, ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఆదివారం ఆ నలుగురిని సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.