బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ అమరులను స్మరించుకునేందుకు, తెలంగాణ హక్కుల దినంగా పాటించేందుకు ఈ నెల 10న ‘గ్రేట్ మిలియన్ మార్చ్ డే’ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల(టీయూ) జేఏసీ ప్రకటించింది. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
10న వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమకారులు పాదయాత్రగా గన్ పార్క్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నేతలు కె.చంద్రశేఖర్ ప్రసాద్, ఉద్యమ నేతలు దయానందరావు, మంచాల వెంకటస్వామి, షేక్ షావలి, గుండా యాదగిరి, గోగిరాల నుధాకర్, ఎండీ ఏక్బాల్, వేముల యాదగిరి, జానికి రెడ్డి, ధనలక్ష్మి, నదానందం తదితరులు పాల్గొన్నారు.
