రిసార్ట్స్ లో న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్ తీసుకోవాలి : టంగుటూరి శ్రీను

రిసార్ట్స్ లో న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్ తీసుకోవాలి : టంగుటూరి శ్రీను

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ పీఎస్ పరిధిలోని రిసార్ట్ లలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని సీఐ టంగుటూరి శ్రీను తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మిషన్ లేకుండా ఈవెంట్లు నిర్వహించే రిస్టార్ ల మేనేజ్ మెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండొద్దన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు వేడుకలను ముగించాలన్నారు. 

ప్రతి ఈవెంట్ లో సీసీ కెమెరా, సెక్యూరిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఈవెంట్లలో లిక్కర్ కు​ అనుమతి లేదన్నారు. కెపాసిటీకి మించి పాస్​లు ఇవ్వొద్దని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే రూ.10 వేల ఫైన్ తో పాటు ఆరు నెలల జైలు శిక్ష పడుతుందన్నారు.