వ్యాపారవేత్త ఇంట్లో రూ. 1.30 కోట్ల నగదు

వ్యాపారవేత్త ఇంట్లో రూ. 1.30 కోట్ల నగదు

వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలోని ఓ వ్యాపారి నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 1.39 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గజోల్ ప్రాంతంలో ఉన్న వ్యాపార వేత్త జై ప్రకాష్ సాహా నివాసంలో భారీగా నగదు ఉంచినట్లు తమకు సమాచారం అందినట్లు సీఐడీ స్పెషల్ సూపరింటెండెంట్ తెలిపారు. జై ప్రకాష్ సాహా చేపల వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్, స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన ఓ వ్యక్తికి సంబంధించిన నగదు అని భావిస్తున్నారు. ఘటనా ప్రాంతం భారత్ - బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉంది. డబ్బులు లెక్కించేందుకు మిషన్లు తెప్పించారు. మొత్తం రూ. 1,39,03,000 నగదు ఉందని అధికారి వెల్లడించారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.