తెలంగాణలో సిగరెట్లు, పొగాకు యాడ్స్ నిషేధం..

 తెలంగాణలో సిగరెట్లు, పొగాకు యాడ్స్ నిషేధం..

సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, వినియోగానికి సంబంధించి యాడ్స్.. అంటే ప్రకటనలను తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు 2024, ఫిబ్రవరి 12వ తేదీ అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపింది సభ.సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు బిల్లును ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చ లేకుండా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినందుకు తోటి సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు దన్యవాదాలు తెలిపారు.

 యువత ధూమపానానికి దూరంగా ఉండాలని ఇందుకు దూమపానం, పొగాకు సంబంధించి ఎలాంటి యాడ్స్ ను ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సోమవారం హుక్కా సెంటర్లపై నిషేదం విధిస్తూ బిల్లును ఆమోదించారు. పొగ కంటే  హుక్కా  మరింత హానికరమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.