
చాలా మంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సిగరెట్లకు అలవాటుపడుతుంటారు. ఈ రకమైన నిరంతర ధూమపానం వ్యసనానికి దారితీస్తుంది.ఇలా సిగరెట్లు కాల్చడం వల్ల నిజంగా పిల్లల సమస్య ఎదుర్కొవలసి ఉంటుందని ఓ అధ్యయనం ద్వారా తెలుస్తుంది.
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రతి సిగరెట్ ప్యాక్ పైనా రాసి ఉంటుంది. కానీ, ఎవరూ పట్టించుకోరు. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడుతారని హెచ్చరించినా ఏ ఒక్కరికీ బోధపడదు. అయితే ఈ అలవాటు మహిళల్లో అండోత్పత్తికి అడ్డుపడితే, పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని నాశనం చేస్తుంది.
మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో పురుషుడికి సిగరెట్ తాగే అలవాటు ఉన్నా ప్రమాదమే. పుట్టే పిల్లలపై అది ప్రభావం చూపుతుంది. ఆ బిడ్డకు లుకేమియా లేదా రక్త కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. అయితే, పొగతాగే పురుషులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. పొగతాగే అలవాటు ఉన్నవాళ్లకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువని తేలింది. శాన్ ఫ్రాన్సిస్కో సొసైటీ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్' సెంటర్ చేసిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది.
►ALSO READ | Snacks Time : పొటాటో పాన్ కేక్స్.. లొట్టలేస్తూ లాగించేస్తారు.. ఎలా తయారు చేయాలంటే..!
గుప్పుగుప్పుమని పొగ తాగేవాళ్లకు పిల్లలు పుట్టే యోగ్యం తక్కువేనట. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్లల్లో 13 శాతం మంది సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాళ్లేనని పరి శోధకులు తెలిపారు. యువకులు, కొత్తగా పెళ్ళయిన వాళ్లయినా ఈ విషయం గుర్తించి సిగరెట్ మానితే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.
వెలుగు, లైఫ్