Snacks Time : పొటాటో పాన్ కేక్స్.. లొట్టలేస్తూ లాగించేస్తారు.. ఎలా తయారు చేయాలంటే..!

Snacks Time :  పొటాటో పాన్ కేక్స్.. లొట్టలేస్తూ లాగించేస్తారు.. ఎలా తయారు చేయాలంటే..!

కూరగాయల మార్కెట్​కు వెళితే పొటాటో.. అదేనండి బంగాళదుంప సంచిలో పడకుండా ఇంటికి చేరుకోము.  బంగాళదుంపను మిక్స్​ డ్​ కర్రీగా.. చిప్స్​ గా తయారు చేస్తారు.  ఎప్పుడూ ఒకే వెరైటీ అయితే బోరు కొడుతుంది కదా.. వెరైటీగా పొటాటో పాన్​ కేక్స్​ తయారు చేసుకొని తింటే ఆహా.. ఏమి రుచిరా .. అంటూ లొట్టలేసుకొని తింటారు.  ఇప్పడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .

పొటాటో పాన్​ కేక్స్ తయారీకి కావలసినవి

 

  • బంగాళాదుంపలు (పెద్దవి)– నాలుగు
  • ఉల్లిపాయ –ఒకటి
  • కోడిగుడ్డు –ఒకటి
  • మైదా –రెండు చెంచాలు
  • మిరియాల పొడి– చిటికెడు
  • ఉప్పు –తగినంత
  • నూనె –రెండు మూడు చెంచాలు

తయారీ విధానం:  ఓ బౌల్​ లో  కోడిగుడ్డు సొన వేసి బాగా గిలకొట్టా లి. అందులో ఉప్పు, మిరియాల పొడి వేయాలి ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి సొనలో వేసి కలపాలి. తరువాత దీన్ని మిక్సీలో వేసి చిక్కగా అయ్యేలా చేసుకోవాలి. బంగాళాదుంపల్ని ఉడికించి, పొట్టు తీసి, మెత్తని పేస్ట్​ లా  చేసి...  కొద్దిగా ఉప్పు కలపాలి. 

►ALSO READ | Good Health: అరటి ఆకు అన్నం .. అద్భుతమైన ఆరోగ్యం..!

ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఫొటో ఉన్న ఆకారంలో ఒత్తి పెట్టుకోవాలి. స్టౌ మీద అట్ల రేకు పెట్టి కొద్దిగా నూనె వేయాలి (నాన్​ స్టిక్ ప్యాన్ అయితే నూనె వేయకపోయినా ఫర్వాలేదు). వేడెక్కాక ఒక్కొక్కటీ తీసుకుని, కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి రేకు మీద పెట్టాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అన్నిటినీ ఇలాగే కాల్చుకోవాలి.  వీటిని పెరుగుతో కాని.. పెరుగు చట్నీతో కాని తింటే చాలా బాగుంటాయి. 

వెలుగు, లైఫ్​