సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ కార్యదర్శి సుధాకర్ కారుపై దాడి

సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ కార్యదర్శి సుధాకర్ కారుపై దాడి

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్ ఇంటిపై సినీ మేనేజర్ హరినాథ్ దాడి చేశారు. ఆదివారం(అక్టోబర్ 29) అర్ధరాత్రి రెండు గంటలకు సుధాకర్ ఇంటి వద్ద హరినాథ్ నానా హంగామా సృష్టించాడని సుధాకర్ తెలిపారు. సెల్ఫీ వీడియోతో తన అంతు చూస్తానంటూ.. హరినాథ్ బెదిరింపులకు పాల్పడ్డాడని సుధాకర్ చెప్పారు. 

బండరాళ్లతో సుధాకర్ కారును హరినాథ్ ధ్వంసం చేశారని పోలీసులకు సుధాకర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూజా హెగ్డే,రకుల్ ప్రీత్ సింగ్, ప్రియమణి వంటి పలువురు సినీ తారలకు హరినాథ్  మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.