బయటపడ్డ లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌.. భూటాన్ నుండి కేరళకి దిగుమతి.. ఎలా పట్టుకున్నారంటే..

బయటపడ్డ లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌.. భూటాన్ నుండి కేరళకి దిగుమతి.. ఎలా పట్టుకున్నారంటే..

భూటాన్ నుండి లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసులో కొందరు సినీ హీరోల పేర్లు బయటపడ్డాయి. ఈ కేసుకి సంబంధించి పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ ఇళ్లపై కూడా కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. భూటాన్ నుండి కేరళకు అక్రమంగా కార్ల స్మగ్లింగ్ రాకెట్‌ను వాహన గుర్తింపు సంఖ్య (VIN) చెకింగ్ ద్వారా పట్టుకోవచ్చని అధికారులు అంటున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు కేరళలోని 35 ప్రాంతాల్లో ముఖ్యంగా కోజికోడ్, మలప్పురం, ఎర్నాకుళం, త్రిస్సూర్, తిరువనంతపురంలో సోదాలు చేశారు. ఈ దాడుల్లో దుల్కర్ సల్మాన్ నివాసం నుండి రెండు లగ్జరీ కార్లు, అమిత్ చక్కలక్కల్ ఇంటి నుండి ఎనిమిది కార్లు సహా మొత్తం 36 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

VIN అనేది ఒక కారుకు ఉండే ప్రత్యేకమైన గుర్తింపు నంబర్. దీనిని ఛాసిస్ నంబర్ అని కూడా అంటారు. ఈ 17 అక్షరాల నంబర్  కారు ఎక్కడ తయారైంది, ఓనర్ వివరాలు, ఆక్సిడెంట్  హిస్టరీ, చట్టబద్ధమైన స్టేటస్ వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ నంబర్ కారు ఛాసిస్‌పై, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌పై,  ఇన్సూరెన్స్ పేపర్లపై కూడా ఉంటుంది. అయితే అధికారుల ప్రకారం, ఈ అక్రమ రవాణాను మొదట్లోనే పట్టుకోవడానికి కారు VIN నంబర్‌ను అసలు రిజిస్ట్రేషన్ అథారిటీతో చెక్ చేసి ఉంటే ఈ కార్లు భూటాన్ నుండి వచ్చాయా లేదా ఎక్కడి నుండి వచ్చాయి, అక్రమంగా దిగుమతి అయ్యాయా లేదా అని వెంటనే తెలిసేది. 

భారత చట్టాల ప్రకారం, పాత కార్లను దిగుమతి చేయడం నిషేధం. ఒకవేళ ఎవరైనా ఇల్లు మార్చినప్పుడు (residence transfer) పాత కారును దిగుమతి చేసుకోవాలంటే, ఆ కారును కనీసం మూడు సంవత్సరాలు ఆ దేశంలో ఉపయోగించి ఉండాలి. అలాంటి వాటిపై 160% పన్ను కూడా కట్టాలి.  స్మగ్లింగ్ చేసిన కార్లలో చాలావరకు ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ అయ్యాయని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీనికి కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల (RTO) సహకారం కూడా ఉండోచ్చని అనుమానిస్తున్నారు. కేరళలో ఈ కార్లను తిరిగి రిజిస్టర్ చేయించుకునేటప్పుడు, వాటి వివరాలు ఇప్పటికే 'పరివాహన్' పోర్టల్‌లో ఉంటాయి. ఒక వాహనం కేరళలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటున్నప్పుడు రిజిస్టర్ చేయించుకోవడం తప్పనిసరి.

MVD అధికారి చెప్పిన  ప్రకారం, రి-రిజిస్టర్ చేయడానికి అసలు రిజిస్ట్రేషన్ అథారిటీ నుండి  No Objection Certificate అవసరం. మిగిలిన వివరాలు ఆన్‌లైన్‌లో  ఉంటాయి. చాలా సాధారణంగా ఉపయోగించే కార్ల విషయంలో RTO అధికారులు ఎక్కువగా చెకింగ్స్ చేయరు. ఒకవేళ ఏదైనా అక్రమం బయటపడితే, రి-రిజిస్టర్ చేసిన RTOకి  సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ అసలు రిజిస్ట్రేషన్ అథారిటీకి రిపోర్ట్  పంపుతుంది. కానీ ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.