సినిమా థియేటర్‭లోకి బయట తిండ్లకు నో ఎంట్రీ: సుప్రీం కోర్టు

సినిమా థియేటర్‭లోకి బయట తిండ్లకు నో ఎంట్రీ: సుప్రీం కోర్టు

సినిమా థియేటర్స్‭లోకి తినుబండారాల అనుమతి పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బయటి నుంచి ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకురాకుండా అడ్డుకునే హక్కు సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ యజమానులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. థియేటర్లు, మల్టీప్లెక్స్ ల్లో అందుబాటులో ఉన్న వాటిని వినియోగించుకోవాలా వద్దా అన్నది ప్రేక్షకుడి ఇష్టమని తెలిపింది. హాల్స్ వద్ద స్నాక్స్, కూల్ డ్రింక్స్‭ను.. సినిమా ప్రేక్షకుడు ఖచ్చితంగా కొనుగోలు చేయాలన్న నిబంధన ఏం లేదని.. ప్రేక్షకుడు అవసరమైతేనే స్నాక్స్ కొనుగోలు చేస్తాడని చెప్పింది.

అమ్మకాల కోసం సినిమాహాళ్లలో బయటి ఆహారపదార్థాలను అనుమతించాలన్న జమ్మూకశ్మీర్ హైకోర్టు తీర్పును సుప్రీం పక్కన పెట్టింది. వినోదం కోసమే ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్తారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.