Senthil Kumar: రాజమౌళితో గతంలో కూడా గ్యాప్ వచ్చింది.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ముచ్చట్లు

Senthil Kumar: రాజమౌళితో గతంలో కూడా గ్యాప్ వచ్చింది.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ముచ్చట్లు

నేనొక సినిమా ఒప్పుకోవడానికి అందులో ఎమోషన్‌‌‌‌ ఉందో లేదో చూస్తా. ప్రేక్షకుల్ని కదిలించే ఎమోషన్‌‌‌‌ లేకపోతే మిగతా ఎలిమెంట్స్ ఎన్నున్నా వర్కౌట్ అవ్వదు. ఇందులోని కోర్ ఎమోషన్‌‌‌‌ చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాస్ తగ్గిపోతున్న టైమ్‌‌‌‌లో ఇలాంటి అవకాశం రావడం ఆనందంగా ఉంది. హెవీ గ్రాఫిక్స్, సీజీ వర్క్ ఉన్న ‘ఆర్ఆర్ఆర్’లాంటి సినిమా తర్వాత ఇలాంటి సినిమా చేయడం రిఫ్రెష్‌‌‌‌గా అనిపించింది.

నిజానికి కొత్త వాళ్లను పరిచయం చేసేటప్పుడు ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్‌‌‌‌ ఎవరూ టచ్ చేయరు. ప్రేక్షకులను ఆకట్టుకునే స్ట్రాంగ్‌‌‌‌ ఎమోషన్‌‌‌‌ ఇందులో ఉంది. కిరీటి కొత్త హీరో అయినప్పటికీ దాన్నొక ఛాలెంజ్‌‌‌‌గా తీసుకొని నటించాడు. డ్యాన్స్‌‌‌‌ అద్భుతంగా చేయడంతో పాటు యాక్షన్‌‌‌‌, ఎమోషనల్ సీన్స్‌‌‌‌లో ఎంతో బ్యాలెన్స్‌‌‌‌గా నటించాడు.‘సై’తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు జెనీలియాతో కలిసి వర్క్ చేశా. ఇందులో ఆమె పాత్ర, పెర్ఫార్మన్స్ చూసి ప్రేక్షకులు సర్​ప్రైజ్‌ అవుతారు.

ఒక దర్శకుడికి క్లారిటీ చాలా ఇంపార్టెంట్‌‌‌‌. ఆ క్వాలిటీ ఈ చిత్ర దర్శకుడు రాధాకృష్ణలో ఉంది. అలాగే ఓ కొత్త హీరోని ఎలా లాంచ్‌‌‌‌ చేయడానికి తగ్గ టెక్నికల్‌‌‌‌ టీమ్‌‌‌‌ను నిర్మాత సాయి గారు ఎంపిక చేసుకున్నారు. ‘ఈగ’ తర్వాత మరోసారి వారాహి బ్యానర్‌‌‌‌‌‌‌‌లో వర్క్ చేయడం హ్యాపీ.

రాజమౌళి గారి సినిమాల విషయంలో ఇప్పుడే కాదు గతంలో కూడా గ్యాప్ వచ్చింది. విక్రమార్కుడు, మర్యాద రామన్న సినిమాలకు నేను వర్క్ చేయలేదు. ఇప్పుడు కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు (నవ్వుతూ). తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తాం. ప్రస్తుతం స్వయంభు, ఇండియన్ హౌస్ సినిమాలకు వర్క్ చేస్తున్నా. ఇక డైరెక్షన్ చేయాలనే ఆలోచనైతే ఉంది. కొన్ని స్టోరీస్‌‌‌‌పై వర్క్ చేస్తున్నా. ఇంకాస్త సమయం పడుతుంది.

‘‘పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప సినిమాలకు పనిచేశాను. ఓ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా మంచి పేరుతో పాటు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు కేకే సెంథిల్ కుమార్. గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ‘జూనియర్‌‌‌‌‌‌‌‌’ చిత్రానికి ఆయన వర్క్ చేశారు. జులై 18న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా సెంథిల్ కుమార్ ఇలా ముచ్చటించారు.