కరోనా డ్రైస్వాబ్​ టెస్టు కిట్లపై సీసీఎంబీ, మెరిల్​ అగ్రిమెంట్

V6 Velugu Posted on Jun 03, 2021

ఉప్పల్​, వెలుగు: కరోనా వైరస్​ నిర్ధారణను మరింత వేగవంతంగా గుర్తించేందుకు సీసీఎంబీ (ద సెంటర్ ఫర్​సెల్యూలార్​ అండ్​ మాలిక్యులర్​బయాలజీ) అందుబాటులోకి తెచ్చిన డ్రైస్వాబ్ ​ఆధారిత ఆర్​టీ-పీసీఆర్ ​అవసరమైన కమర్షియల్​ కిట్ల తయారీకి మెరిల్​ సంస్థ శ్రీకారం చుట్టింది. దేశంలోని డయాగ్నొస్టిక్ ల్యాబ్​ల్లో డ్రై స్వాబ్-ఆధారిత పరీక్షలను వాణిజ్యపరంగా స్కేలింగ్ చేయడానికి సీసీఎంబీ, మెరిల్​ డయగ్నోస్టిక్​ సంస్థతో అగ్రిమెంట్​ చేసుకుంది. ఈ కమర్షియల్​ కిట్లను  నేరుగా డ్రైస్వాబ్​ ఆర్​టీ-పీసీఆర్​ కోసం ఉపయోగించవచ్చు. దీనికి ఐసీఎంఆర్​ కూడా ఆమోదం తెలిపింది. వీటితో  టెస్టుల్లో  కచ్చితత్వం ఉండడమే కాకుండా సమయం కూడా చాలా ఆదా అవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్​ వినయ్​ నందికూరి తెలిపారు.

500 శాంపిళ్లను టెస్టు చేసేందుకు సుమారు 4గంటల సమయం పడుతుంది. దీనికి తోడు వైరస్​ ట్రాన్స్​పోర్ట్​ మీడియం(వీటీఎం), ఆర్​ఎన్​ఏ వేరు చేయడం అనే రెండు పరీక్షలకు  డబ్బుతో పాటు అధికంగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. అయితే డ్రైస్వాబ్​ ఆర్​టీ-పీసీఆర్​ టెస్టు విధానం వల్ల 40 నుంచి 50శాతం వరకు పరీక్ష ఖర్చులు తగ్గుతాయని, దీనికి తోడు సమయం కూడా చాలా  క​లిసి వస్తుందని  సీఎస్​ఐఆర్ ​-సీసీఎంబీ సైంటిఫిస్​ అడ్వైజర్​ డాక్టర్​ రాకేశ్​ మిశ్రా తెలిపారు. కరోనా  డ్రైస్వాబ్​ ఆర్​టీ-పీసీఆర్​ టెస్టు కోసం మెరిల్​ డయగ్నోస్టిక్​ సంస్థ  ప్రస్తుతం నెలకు 2 కోట్ల కిట్లను తయారు చేసేందుకు సీసీఎంబీతో అగ్రిమెంట్​ చేసుకుంది.  ఒక్క కిట్​తో వంద శాంపిళ్లను పరీక్ష చేయవచ్చు. ఒక్కో శాంపిల్​ పరీక్షకు కేవలం రూ.45 నుంచి రూ.60 ఖర్చు అవుతుంది. 

Tagged Hyderabad, ccmb, CSIR, , Covid dry swab test, Meril Diagnostics

Latest Videos

Subscribe Now

More News