V6 News

Citadel 2 Trailer: స్పై థ్రిల్లర్ ‘సిటడెల్‌ సీజన్‌ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ట్రైలర్‌తో సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

Citadel 2 Trailer: స్పై థ్రిల్లర్ ‘సిటడెల్‌ సీజన్‌ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ట్రైలర్‌తో సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన స్పై థ్రిల్లర్ సిరీస్ ‘సిటడెల్‌ సీజన్‌ 1’ గురించి తెలిసిందే. జోష్ అప్పెల్‌బామ్, బ్రయాన్ ఓహ్ మరియు డేవిడ్ వెయిల్ తెరకెక్కించిన సిరీస్ ప్రేక్షకుల్ని వీపరీతంగా ఆకట్టుకుంది. ఏడాదిపాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతూ సత్తా చాటింది. ఇపుడు ఆడియన్స్లో నెలకొన్న ఇంట్రెస్ట్ని హోల్డ్ చేయకుండా సీజన్ 2ని తీసుకొస్తున్నారు మేకర్స్. 

ఇవాళ ఏప్రిల్ 22, 2026న ముందస్తు సమాచారం ఇవ్వకుండా రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాకుండా ‘సీజన్‌ 2’ ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. వచ్చే నెల మే 6 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది. ఇంగ్లిష్‌తో పాటుగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుందని తెలిపింది.

‘సిటడెల్‌ సీజన్‌ 2’ కథ.. 

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన స్పై-థ్రిల్లర్ సిరీస్ సిటడెల్‌, తన రెండో సీజన్‌తో మరింత ఉత్కంఠభరితమైన కథను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ సీజన్‌లో మేసన్ కేన్ (Richard Madden), నాదియా సిన్ (Priyanka Chopra), మరియు బెర్నార్డ్ ఓర్లిక్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒకప్పుడు శక్తివంతమైన గూఢచారి సంస్థ ‘సిటడెల్‌’కు చెందిన ఈ ఎలైట్ ఏజెంట్లు, గత ఘటనల అనంతరం మళ్లీ ప్రమాదకర మిషన్ కోసం రంగంలోకి దిగుతున్నారు.

‘సిటడెల్‌’ సంస్థను “Manticore” అనే క్రూర నెట్‌వర్క్ పూర్తిగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని ప్రభావశీల కుటుంబాల మద్దతుతో నడిచే ఈ నెట్‌వర్క్, అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇదే సమయంలో మానవాళికి ముప్పుగా మారే ఒక కొత్త గ్లోబల్ సమస్య వెలుగులోకి రావడంతో, మేసన్, నాదియా, బెర్నార్డ్ ముగ్గురు మళ్లీ కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ క్రమంలో, వారు టాలెంట్ ఉన్న కొత్త ఏజెంట్లను జట్టులో చేర్చుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక భారీ కుట్రను అడ్డుకోవడానికి మిషన్ ప్రారంభిస్తారు. మానవాళి భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ కుట్రను అంతం చేయడం వారి ప్రధాన లక్ష్యంగా మారుతుంది.

ఈ సీజన్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు, అనూహ్యమైన మోసాలు, మరియు కొత్త మిస్టీరియస్ పాత్రల ప్రవేశం కథకు మరింత బలం ఇవ్వనున్నాయి. ముఖ్యంగా, ప్రతి పాత్ర చుట్టూ సస్పెన్స్ నెలకొనడం, ఎవరూ పూర్తిగా నమ్మదగినవారు కాకపోవడం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చనుంది.