కరోనా ఎఫెక్ట్: వాళ్ల దగ్గర కూరగాయలు కొనొద్దు

కరోనా ఎఫెక్ట్: వాళ్ల దగ్గర కూరగాయలు కొనొద్దు

లక్నో: ముస్లిం అమ్మకందారుల నుంచి కూరగాయలు కొనొద్దు అంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్ చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన ప్రజలు కూరగాయలను లాలాజలంతో కలుషితం చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులును ఎగ్జాంపుల్ చేస్తూ వారు అమ్మే వస్తువులను కొనవద్దు అని డియోరియా జిల్లావాసులను కోరారు. కరోనా వ్యాప్తికి తబ్లిగి జమాత్ ను నిందిస్తూ తివారీ ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘ఒక విషయం గుర్తుంచుకోండి, నేను అందరికీ బహిరంగంగా చెబుతున్నా, మియాస్(ముస్లింల) నుంచి ఎవరూ కూరగాయలు కొనకూడదు”అని ఎమ్మెల్యే తివారీ నగర పాలికా కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో సహా ప్రజలకు చెప్పడం వీడియోలో కనిపిస్తుంది.
దీనిపై తివారీని ప్రశ్నించగా.. అది వారం కిందట జరిగిన కార్యక్రమం. కరోనా ఎఫెక్టు తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూరగాయల అమ్మకందారులు ఏమాత్రం అనారోగ్యంగానో, అనుమానంగానో కనిపిస్తే.. వారి నుంచి కొనకుండా ఉండటం మంచిదని వారికి సలహా ఇచ్చాను. లాక్​డౌన్ పరిస్థితులు ఎత్తివేసిన తర్వాత వారినే నిర్ణయించుకోవాలని చెప్పాను”అని సమాధానమిచ్చారు. జమాత్ సభ్యుల వల్ల ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, కరోనావైరస్ వ్యాధిని వ్యాప్తి చేసే ప్రయత్నంలో ఒక సమాజంలోని ప్రజలు లాలాజలంతో కలుషితమైన కూరగాయలను విక్రయిస్తున్నారనే ఫిర్యాదులను విన్న తర్వాతే ఈ సలహా ఇచ్చానన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని, దాన్ని అనుసరించాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించాల్సి ఉందన్నారు. ఈ వీడియో ఆధారంగా చాలామంది ముస్లింలు అధికారులపై ఉమ్మివేస్తున్నట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయి. ఆ తర్వాత అవన్నీ ఫేక్ వీడియోలేనని తేలింది.