- లేబర్కోడ్లు, కొత్త గనుల సాధనకు దేశవ్యాప్త సమ్మె
- సీఐటీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ పాలడుగు భాస్కర్
కోల్‌బెల్ట్, వెలుగు: కేంద్రం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని సీఐటీయూ రాష్ట్ర జనరల్సెక్రటరీ పాలడుగు భాస్కర్పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ఎంప్లాయీస్యూనియన్17వ రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
లేబర్ కోడ్ వల్ల కార్మికుల పని గంటలు పెరుగుతాయని, సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణికి వేజ్‌బోర్డు కూడా ఉండదని పేర్కొన్నారు. కేంద్రం కార్మిక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తోందని విమర్శించారు. జాతీయ విత్తన బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తే రైతులు దివాలా తీస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈజీఎస్ పథకం ఎత్తివేతకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు.
సింగరేణి బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించకుండా కేంద్రం వేలంలో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ. 48వేల కోట్లు ఇవ్వకపోవడంతో సింగరేణి ఆర్థిక సంక్షోభంలో పడుతుందన్నారు. వచ్చే నెల 12న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలని కోరారు. ఈ సభలో యూనియన్స్టేట్అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి , జనరల్ సెక్రటరీ మంద నర్సింహరావు, గౌరవ అధ్యక్షుడు పి.రాజారావు, సీఐటీయూ స్టేట్వైస్ప్రెసిడెంట్భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
