
- జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
సంగారెడ్డి టౌన్, వెలుగు: గ్రామ పంచాయతీలలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలుకావడం లేదని చట్టపరమైన సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ఆరోపించారు. మంగళవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో పంచాయతీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా హాజరైన ఆయన మాట్లాడుతూ... మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 9న చేపట్టే సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్తయ్య, దశరథ్, నాయకులు శంకర్, శివరాజ్ ,అశోక్, నాగరాజు ,యాదమ్మ ,లక్ష్మి ,రాజు తదితరులు పాల్గొన్నారు