
తాండూరు, వెలుగు: ఆశావర్కర్ల సమస్యలు తీర్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి .రాజారాం డిమాండ్చేశారు. మంగళవారం తాండూరు పీహెచ్సీ ముందు సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. కార్యాలయం అధికారికి వినతి పత్రం అందజేశారు. రాజారాం మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలన్నారు.
ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామన్నారు. సెప్టెంబరు 1న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సీనియారిటీ ప్రకారం ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రతినిధులు కవిత, రాజేశ్వరి, సావిత్రి, సునిత, భాగ్య, చంద్రకళ, భారతి, అనురాధ, జయ, మల్లేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.