కార్మిక సమస్యలు మాట్లాడని ఎమ్మెల్యేలు అవసరమా?

కార్మిక సమస్యలు మాట్లాడని ఎమ్మెల్యేలు అవసరమా?

నస్పూర్, వెలుగు: కార్మికుల గురించి అసెంబ్లీలో మాట్లాడని ఎమ్మెల్యేలను మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలని సీఐటీయూ లీడర్లు అన్నారు. బుధవారం ఆర్కే న్యూటెక్ గనిపై జరిగిన గేట్ మీటింగ్​లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ సంఘం నాయకులు ఏనాడూ మాట్లాడలేదని, కరోనా సమయంలోనూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేసినా ఎలాంటి గుర్తింపు లేదన్నారు.

 సంస్థకు రావాల్సిన బకాయిలు కట్టక, కార్మికుల జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అడిగారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సంస్థకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని డిమాండ్​ చేశారు. స్థానిక లీడర్లు గుల్ల బాలాజీ, గోదారి భాగ్యరాజ్, విడువల్లి శంకర్, వెంగళ శ్రీనివాస్, శ్రీపతి బాణేశ్, అజయ్, అశోక్, సదానందం,  రాజయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.