కోలిండియాలో బొగ్గు గనులపై సీఐటీయూ నిరసనలు

కోలిండియాలో బొగ్గు గనులపై సీఐటీయూ నిరసనలు

కోల్​బెల్ట్, వెలుగు : కోలిండియాలో బొగ్గు గని కార్మికుల వేతనాలు ఆపేయడం, డీపీఈ గైడ్​లైన్స్​ను వ్యతిరేకిస్తూ సింగరేణి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. మంగళవారం మందమర్రి ఏరియాలోని కేకే5 గనిపై సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. 11వ వేతన ఒప్పందం ప్రకారం బొగ్గు గని కార్మికులకు మూడు నెలలుగా కొత్త జీతాలు అమలు చేస్తున్నారని, 23 నెలల ఏరియర్స్​కూడా చెల్లించారని తెలిపారు. అయితే, కొంతమంది ఆఫీసర్లు డీపీఈ గైడ్​లైన్స్​ను అడ్డుపెట్టుకొని అధికారుల జీతాల కంటే కార్మికులకు ఎక్కువగా ఉన్నాయని కేసు వేశారని

సెప్టెంబర్​ నెలకు సంబంధించి కొత్త జీతాలను నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్​చేస్తూ కోలిండియా వ్యాప్తంగా ఇచ్చిన నిరసన కార్యక్రమంలో భాగంగా సింగరేణిలో ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు. అనంతరం గని మేనేజర్​ భూశంకరయ్యకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ మందమర్రి బ్రాంచ్ ప్రెసిడెంట్​ఎస్.వెంకటస్వామి, పిట్​సెక్రటరీ సంకె వెంకటేశ్, లీడర్లు వడ్లకొండ శివ, చైతన్యరెడ్డి, కలవల శ్రీనివాస్, నవీన్, ఆదర్శ్, తిరుపతి నాయక్​ తదితరులు పాల్గొన్నారు.