డిసెంబరులో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు : చుక్క రాములు

డిసెంబరులో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు : చుక్క రాములు

మెదక్​ టౌన్, వెలుగు: డిసెంబర్ నెల​లో మెదక్​పట్టణంలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. సోమవారం పట్టణంలోని కేవల్​ కిషన్​ భవనంలో మహాసభల పోస్టర్​ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ 5వ మహాసభలు డిసెంబర్ 7,-9 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటిసారిగా మెదక్ పట్టణంలో జరుగుతున్న సభలకు 33 జిల్లాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని వివరించారు.

జిల్లాలో విస్తృతంగా సెమినార్స్, చర్చా గోష్టిలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని కోరారు.  కార్యక్రమంలో ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ అడివయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేశం, కోశాధికారి బాలమణి, కార్యదర్శులు నర్సమ్మ, మహేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్​ సెక్రటరీలు గౌరయ్య, సంతోష్, నాగరాజు పాల్గొన్నారు.