మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహించాలి : సిటీ సీపీ ఆనంద్

మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహించాలి : సిటీ సీపీ ఆనంద్
  •     సిటీ  సీపీ ఆనంద్

హైదరాబాద్‌, వెలుగు : ఈ నెల 29న జరగనున్న మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో ముస్లిం మత పెద్దలతో సిటీ సీపీ ఆనంద్ మంగళవారం కో ఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించారు. సాలార్‌‌జంగ్‌ మ్యూజియం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సెక్యూరిటీ, ట్రాఫిక్‌ ఇతర ఏర్పాట్లపై వారి నుంచి సలహాలు,సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. హోంమంత్రి ఆధ్వర్యంలో హైలెవల్‌ మీటింగ్ జరిగిందని, జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రిసిటీ, వాటర్‌‌ బోర్డ్‌ సహా అన్ని డిపార్ట్​మెంట్ల అధికారులతో చర్చించామని తెలిపారు. 

బీబీకా అలావాను ఏనుగుపై ఊరేంగించే సమయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. బీబీకా ఆలం నుంచి దారుసలాం వరకు జరుగనున్న ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.