ఫుల్ రష్ : పండుగలకు సొంతూళ్ల బాట పట్టిన సిటీ జనాలు

ఫుల్ రష్ : పండుగలకు సొంతూళ్ల బాట పట్టిన సిటీ జనాలు

పండుగలకు సొంతూళ్ల బాట పట్టిన సిటీ జనాలు
రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
ఆర్టీసీ సమ్మె ప్రకటనతో ముందస్తు గానే జర్నీ

హైదరాబాద్ : పండుగకు సిటీ జనాలు సొంతూళ్ల బాట పట్టడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో అతి పెద్ద పండుగలు బతుకమ్మ, దసరా కావడంతో కుటుం బసభ్యులతో తరలివెళ్తున్నారు. దీంతో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాం డ్లతో పాటు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో గత శనివారం నుంచే ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. సీట్లు లేక మహిళలు, వృద్ధులు,చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. జనం రద్దీని తట్టుకోవాలంటే బస్సులు, రైళ్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.