మైక్రో సాఫ్ట్ విండోస్ సిస్టమ్ లో ఏర్పడిన ఎర్రర్ తో జూలై19న ప్రపంచం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఎయిర్ లైన్స్ నుంచి మొదలుకొని బ్యాంకింగ్, సూపర్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజీలు, హాస్పిటల్స్, టీవీ చానెళ్ల ప్రసారాలు, తదితర వాటిపై తీవ్ర ప్రభావం పడింది. అనేక దేశాల్లో ఆయా ఎయిర్ లైన్స్ సంస్థలకు ఆన్ లైన్ సేవల్లో ఆటంకం ఏర్పడటంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. జూలై 19న దాదాపు 200 ఇండిగో విమానాలను రద్దు అయ్యాయి. శంషాబాద్ లో 35 విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే..
అయితే ఎయిర్ పోర్టుల్లో ఎయిర్ లైన్స్ సేవలు తిరిగి సజావుగా సాగుతున్నాయని ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉదయం 3 గంటల నుండి (జూలై 20), విమానాశ్రయాలలో ఎయిర్‌లైన్ వ్యవస్థలు సాధారణంగా పని చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు విమాన కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి" అని ఒక ప్రకటనలో తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ నుండి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో ప్రపంచవ్యాప్త అంతరాయం ఏర్పడిన ఒక రోజు తర్వాత మంత్రి ఈ ప్రకటన చేశారు. ఆర్థిక రంగ కంపెనీలు, విమానయాన సంస్థలు, ఆసుపత్రులు, టీవీ ఛానెల్‌లు, మరిన్నింటిలో ఎన్నడూ లేని విధంగా జూలై 19న అతిపెద్ద ఐటీ అంతరాయం ఏర్పడింది.
