సివిల్ ​ఇంజనీర్ ​దారుణ హత్య

సివిల్ ​ఇంజనీర్ ​దారుణ హత్య

గండిపేట, వెలుగు: నార్సింగి పోలీస్​స్టేషన్​పరిధిలో ఓ సివిల్​ఇంజనీర్​దారుణ హత్యకు గురయ్యాడు. ఇన్‌‌స్పెక్టర్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ చోటా బజార్‌‌ ప్రాంతానికి చెందిన ఇజాయత్‌‌ ఆలీ(31) సౌదీలో సివిల్​ఇంజనీర్‌‌గా పని చేస్తున్నాడు. 20 రోజుల కింద సిటీకి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి మంచిరేవులలోని గ్రీన్‌‌ లాండ్స్‌‌ వెంచర్‌‌ వద్దకు వెళ్లాడు. 

అక్కడ ఇజాయత్‌‌ ఆలీకి, గుర్తుతెలియని వ్యక్తులతో గొడవ జరిగింది. వారంతా కలిసి ఇజాయత్​ఆలీని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి, గొంతుకోసి చంపారు. అక్కడికి దగ్గర్లో పనిచేస్తున్న కూలీలు గమనించి, ఘటనా స్థలానికి చేరుకునేలోపు యువకుడు చనిపోయి పడి ఉన్నాడు. నిందితులు కారును వదిలేసి పారపోయారు. కేసు నమోదు చేసిన పోలీసుల, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హంతకుల వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.