సివిల్ సప్లై జీఎంపై హైకోర్టులో విచారణ

సివిల్ సప్లై జీఎంపై  హైకోర్టులో విచారణ
  • చైర్మన్, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజర్ ఎం. రమేశ్ కు పదోన్నతి కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం, చైర్మన్ లకు హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. మేనేజర్ గా రమేశ్ కు పదోన్నతి కల్పిస్తూ కార్పొరేషన్ ఎండీ ఆగస్టు 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జి దేవదాస్ ఇతరులు పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని జస్టిన్ ఫుల్లా కార్తీక్ విచారణ చేపట్టి పదోన్నతులపై పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి 6 వారాల్లో నిర్ణయాన్ని తీసుకోవాలని ఆదేశించారు.  ప్రతివాదులైన చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మేనేజర్ గా పదోన్నతి పొందిన రమేశ్ కు నోటీసులు జారీ చేశారు. పదోన్నతిపై వివరణ ఇవ్వాలంటూ విచారణను జనవరి 25కు వాయిదా వేశారు.