కోల్‌కతా ఆర్జీ కర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. తాజాగా సోమవారం ఈ కేసును సీజేఐ బెంచ్విచారించనుంది. ఈ బెంచ్‌లో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. గత నెల 22న ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. విచారణను వాయిదా వేసింది. కాగా, ఈ కేసుతో పాటు సీఐఎస్ఎఫ్ బలగాలకు మమత సర్కారు సహకరించట్లేదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైనా విచారణ జరపనుందని కోర్టు వర్గాలు వెల్లడించాయి.
డాక్టర్‌పై దారుణం జరిగాక ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ వద్ద భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ బలగాలను పంపింది. అయితే, ఆ బలగాలకు మమత సర్కారు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని కేంద్రం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు, మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఆర్జీ కర్ డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.