రంజీ ట్రోఫీ రెండు దశల్లో!.. టాస్‌‌‌‌‌‌‌‌ లేకుండా సీకే నాయుడు ట్రోఫీ

రంజీ ట్రోఫీ రెండు దశల్లో!.. టాస్‌‌‌‌‌‌‌‌ లేకుండా సీకే నాయుడు ట్రోఫీ

ముంబై: ఇండియా డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఈ మేరకు వచ్చే సీజన్‌‌‌‌‌‌‌‌ నుంచి రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించేలా కొత్త ముసాయిదాను రూపొందించింది. ఈ కొత్త ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ను బోర్డు అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు పంపినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఐదు రౌండ్ల రంజీ లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల తర్వాత ముస్తాక్‌‌‌‌‌‌‌‌ అలీ టీ20, విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే వన్డే ట్రోఫీలు పూర్తి చేస్తారు. ఆపై రెండు రౌండ్ల రంజీ లీగ్‌‌‌‌‌‌‌‌, నాకౌట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు నిర్వహించనున్నారు. నార్త్‌‌‌‌ ఇండియాలోని ప్రతికూల వాతావరణం కారణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి, మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల మధ్య విరామం పెంచడానికి కొత్త ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ను ప్రతిపాదించారు.

బీసీసీఐ సెక్రటరీ జై షా, చీఫ్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌ అజిత్‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌, హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌, నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ అకాడమీ హెడ్‌‌‌‌‌‌‌‌ వీవీఎస్‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ప్రతిపాదనలు చేశారు.  ఇక సీకే నాయుడు ట్రోఫీలో టాస్‌‌‌‌‌‌‌‌ను తొలగించాలని చూస్తున్నారు.  దీని ప్రకారం మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలా, బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలా అనేది విజిటింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ నిర్ణయించుకుంటుంది. మంచి ఫలితాలు వస్తే రంజీల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో వన్డే, టీ20, ఇంటర్‌‌‌‌‌‌‌‌ జోనల్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో ఆడే అన్ని జట్లను నేషనల్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్లు ఎంపిక చేయాలన్నది  మరో ప్రతిపాదన.