
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. మైహోమ్స్ సిమెంట్స్ మైనింగ్ లీజ్ పర్యావరణ అభిప్రాయణ సేకరణ విషయంపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గొడవ జరిగింది. మై హోమ్ సంస్థకు అమ్ముడుపోయారంటూ..బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగింది. దీంతో తమ నిజాయితీని నిరూపించుకునేందుకు శివాలయంలో ప్రమాణానికి సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. శంభులింగేశ్వర ఆలయం దగ్గరకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ టెన్షన్ నెలకొంది. పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది.