
హీరో రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కొడుకు మాధవ్ రూరల్ రస్టిక్ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. సోమవారం ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ, మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘మారెమ్మ’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు.. మంచాల నాగరాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో మాధవ్ చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి, మెడలో టవల్‌తో రగ్డ్ లుక్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు.
A Sacrifice the world will never forget. #maremma 🐃❤️
— maadhav bhupathiraju (@maadhav_9999) July 7, 2025
madness is coming ❤️🔥 pic.twitter.com/QusOehEmYF
మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.
నీ ప్రాణం, నా త్యాగం, అమ్మోరి కి అభిషేకం 🐃🔥
— maadhav bhupathiraju (@maadhav_9999) July 6, 2025
Stay Tuned 🙏🏻 4:05pm tomorrow ❤️🔥 pic.twitter.com/qRLreJqJVN