సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత: టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల ఘర్షణ

సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత: టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల ఘర్షణ

సిద్దిపేట స్వర్ణ ప్యాలెస్ హోటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల ఘర్షణకు దిగారు. జిల్లాకు సంబంధం లేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఇక్కడేం పనంటూ బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించారు. హోటల్లో ఆంథోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నల్గొండ జిల్లా నకిరేకల్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో తనిఖీ చేస్తామని బీజేపీ కార్యకర్తలు హోటల్ కు వెళ్లారు. తనిఖీలు చేస్తామనడంపై టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకునేదాకా పరిస్థితి వెళ్లింది.