శ్రీశైలం గేట్లు ఓపెన్.. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు తెరిచిన సీఎం చంద్రబాబు

శ్రీశైలం గేట్లు ఓపెన్.. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు తెరిచిన సీఎం చంద్రబాబు

అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేశారు సీఎం చంద్రబాబు. గేట్ల ఓపెన్ సందర్భంగా శ్రీశైలం డ్యామ్ దగ్గర కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జురాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. 

ALSO READ | జాతీయ మత్స్య బోర్డు ఏపీకి తరలించే కుట్ర .. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లెటర్ !

జురాల గేట్లు తెరవడంతో క్రమంగా శ్రీశైలం జలాశయాన్నికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ఉధృతి నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే చూసేందుకు పర్యాటకులు శ్రీశైలం డ్యామ్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ వివరాలు:

  • డ్యామ్ పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
  • ప్రస్తుతం: 882.10 అడుగులు
  • పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం: 215. 8070 టీఎంసీలు
  • ప్రస్తుతం : 199.2737 టీఎంసీలు
  • ఇన్ ఫ్లో : 1,86,534 క్యూసెక్కులు 
  • ఔట్ ఫ్లో :  1,74,846 క్యూసెక్కులు
  • శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి